ఆంధ్రప్రదేశ్

మా భూమి మాదే అని గర్వంగా చెప్పుకోండి.. నారా లోకేష్ సంచలన ప్రసంగంDecades Of Uncertainty End.. Nara Lokesh Grants Permanent Rights

దశాబ్దాల భయం.. ఏ క్షణాన ఏ అధికారి వచ్చి ఇల్లు ఖాళీ చేయిస్తాడో అనే దిగులు.. కష్టపడి కూడబెట్టిన రూపాయి రూపాయిలతో కట్టుకున్న గూడు ఎక్కడ పరాయిపాలవుతుందోననే ఆందోళన.. కానీ ఆ భయానికి తెరపడే సమయం వచ్చింది! ఐదేళ్ల క్రితం ఇచ్చిన ఒకే ఒక్క మాట ఇప్పుడు వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపింది. మంగళగిరి వేదికగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటో తెలుసా?

గడిచిన ఐదేళ్ల కాలంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తన వద్దకు వచ్చి పడుతున్న బాధలను నారా లోకేష్ గుర్తుచేసుకున్నారు. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నామని, బంధువులు, మిత్రులు అందరూ ఈ ప్రాంతంలోనే ఉన్నారని, రూపాయి రూపాయి జమ చేసి ఇల్లు కట్టుకున్నా భూములపై శాశ్వత హక్కులు లేక నిత్యం భయంతో బతుకుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. అటవీ శాఖ, కొండ పోరంబోకు వంటి వివిధ వర్గీకరణల వల్ల ఒకేసారి అన్ని భూములను క్రమబద్ధీకరించడం సాధ్యం కాకపోయినా, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని ఆనాడే స్పష్టం చేశానని వెల్లడించారు.

హామీ ఇచ్చిన విధంగానే ఇప్పుడు రెండవ విడత కింద 3 వేల కుటుంబాలకు శాశ్వత భూహక్కులు కల్పిస్తున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములను ప్రజలకు శాశ్వతంగా అందిస్తున్నామని తెలిపారు. సొంత ఇల్లు ఉన్నప్పటికీ బ్యాంకుల నుండి రుణాలు పొందే అవకాశం లేక, తాకట్టు పెట్టే పరిస్థితి లేక ఇన్నాళ్లూ అనుభవించిన నరకానికి ఇప్పుడు ముగింపు పడిందన్నారు. ఇకపై ఏ రాజకీయనాయకుడు గానీ, ఏ అధికారి గానీ వచ్చి ఈ భూమి మీది కాదు అని అనలేరని, ప్రజలు ప్రశాంతంగా, ధైర్యంగా జీవించవచ్చని అభయమిచ్చారు.

వీడియో క్రెడిట్: పీటీఐ (PTI)

https://x.com/PTI_News/status/2079435313068523604?s=20
https://x.com/naralokesh/status/2079247822378217846?s=20
స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *