జాతీయ వార్తలుఆంధ్రప్రదేశ్

జాతీయ అనుభవ్ అవార్డు అందుకున్న డా. అయినాపురపు / Sriharikota’s Dr. Ramalingeswara Rao Receives National Anubhav Award 2026

శ్రీహరికోటకు చెందిన ప్రముఖ త్రిభాషా రచయిత, కళాకారుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, స్పేస్ సెంట్రల్ స్కూల్ రిటైర్డ్ పీజీ ఉపాధ్యాయుడు డాక్టర్ అయినాపురపు రామలింగేశ్వరరావు ప్రతిష్టాత్మక జాతీయ ‘అనుభవ్ అవార్డు–2026’ అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆగస్టు 17న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ శాఖలకు, సమాజానికి, దేశాభివృద్ధికి అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తోంది.

డాక్టర్ రామలింగేశ్వరరావు సుమారు 38 ఏళ్లపాటు షార్.. శ్రీహరికోటలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయుడిగా సేవలందించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సుమారు 25 పుస్తకాలు రచించారు. మ్యాజిక్, మిమిక్రీలను మేళవిస్తూ నిర్వహించే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలతోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. పలు దేశాలను సందర్శించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల అనుభవాలు భావితరాలకు, మెరుగైన పరిపాలనకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జాతీయ అనుభవ్ అవార్డు అందుకున్న డాక్టర్ రామలింగేశ్వరరావును శ్రీహరికోట అధికారులు, ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు, అభిమానులు అభినందించారు.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *