హైదరాబాద్ రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్: ఆగస్టులోనే 3 నెలల కోటా బియ్యం, గోధుమల పంపిణీ! Big Update for Telangana Ration Card holders. 3 months quota of Rice and Wheat to be distributed in August
హైదరాబాద్ రేషన్ కార్డుదారులకు తీపి కబురు
హైదరాబాద్ జిల్లాలోని ఫుడ్ సెక్యూరిటీ కార్డు (ఎఫ్ఎస్సీ) లబ్ధిదారులకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన ఆహార ధాన్యాలను ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.
ఉచితంగా బియ్యం.. గోధుమల ధర ఎంతంటే?
ఈ పంపిణీలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బియ్యాన్ని పూర్తి ఉచితంగా అందజేయనున్నారు. అయితే గోధుమలకు మాత్రం కిలోకు రూ.7 చొప్పున వసూలు చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు.
కేటాయింపుల వివరాలు
హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 8,43,607 ఎఫ్ఎస్సీ లేదా రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరి అవసరాల కోసం పౌరసరఫరాల శాఖ 59,602.822 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,279.513 మెట్రిక్ టన్నుల గోధుమలను కేటాయించింది. లబ్ధిదారులు ఆగస్టు నెలలోనే తమకు కేటాయించిన 3 నెలల సరుకులను సమీప రేషన్ షాపుల ద్వారా తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు

డేటా సెంటర్ల చుట్టూ దుమారం.. నిజం ఎక్కడ? Vizag Data Centre Push Faces Water, Green Concerns
August 20, 2026, 7:04 AM IST

Dr Ainapurapu Receives National Anubhav Award 2026
August 18, 2026, 6:47 PM IST

దక్షిణాదిపై గురి.. తెలంగాణకు చోటేదీ? BJP’s New National Team Leaves Telangana Out of Southern Equation
August 18, 2026, 7:41 AM IST

అసెంబ్లీ వద్దు.. శాసనమండలి ముద్దు – ఇదేం తీరు? YSRCP Bets on Council as Assembly Boycott Continues
August 13, 2026, 7:15 AM IST

వైసీపీకి డీఎస్సీ ఆక్సిజన్.. పాలపొంగేనా? DSC Row Gives YSRCP Fresh Political Momentum in Andhra Pradesh
August 11, 2026, 7:01 PM IST
