ఆంధ్రప్రదేశ్

పెయిడ్ ఆర్టిస్టులతో నీచ రాజకీయాలు.. చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్! Ambati Rambabu Exposes TDP’s ‘Paid Artists’ Drama and Social Media Propaganda

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్‌గా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని బద్నాం చేయడానికి ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీపై బూతుల పురాణం!

చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మరీ వైసీపీపై సోషల్ మీడియాలో అత్యంత అసభ్యకరమైన వీడియోలు చేయిస్తున్నారని అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు ఆర్టిస్టులకు వైసీపీ కండువాలు కప్పించి.. తనలాగా, రోజా లాగా, చివరకు జగన్ మోహన్ రెడ్డి లాగా వేషాలు వేయించి సోషల్ మీడియాలో వ్యంగ్యంగా, బూతులు మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి నీచమైన వీడియోలు చూసి చంద్రబాబు ఆనందం పొందుతున్నారని విమర్శించారు.

మార్ఫింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో వికృత చేష్టలు!

జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీ కీలక నేతలను జైల్లో పెట్టినట్లుగా మార్ఫింగ్ వీడియోలు సృష్టించి, వాటిని తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉంటే వాటి పరిష్కారాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. కేవలం యూట్యూబ్ ఛానళ్లకు భారీగా డబ్బులు ఆశజూపి, కొంతమందిని రెచ్చగొట్టి మరీ తమపై బురద జల్లించే పనులు చేస్తున్నారని మండిపడ్డారు.

హామీలు గాలికి.. కక్షసాధింపులకే టాస్క్ ఫోర్స్!

గతంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, యాభై ఏళ్లకే పెన్షన్ వంటి వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని రాంబాబు అన్నారు. కొత్తగా పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్నవాటిని కట్ చేస్తూ, బినామీలకు మాత్రం దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలను పక్కనబెట్టి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాజకీయ కక్షలు తీర్చుకోవడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సోషల్ మీడియా పోస్టింగుల నియంత్రణ పేరిట ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ అంతా తమపై కక్షసాధింపుల కోసమేనని, కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అనైతిక పనులపై తాము ఇప్పటికే అనేక కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *