CVSR డైలీ రౌండప్ – 01-08-2026
ప్రధాని ముందే తడబడిన కేంద్రమంత్రి / Union Minister Big Slip of Tongue Viral

భోగాపురం విమానాశ్రయ సభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సభలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వేదికపై ఉన్న నాయకుల పేర్లు, వారి పదవులను ప్రస్తావించేటప్పుడు ఒక్కసారిగా తడబడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల స్థానాలను మార్చి పలకడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రధాని మోదీ సమక్షంలోనే ఈ చిన్న తడబాటు జరగడంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
An unexpected slip of the tongue by Union Minister Srinivasa Varma at the Bhogapuram event has caught everyone’s attention. While addressing the gathering in the presence of PM Narendra Modi, the Minister accidentally swapped the designations of Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan. The video showing this brief moment of confusion has now gone viral across social media platforms.
ప్రత్యర్థులకు నారా లోకేష్ పంచ్.. ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా! Arthamainda Raja? Lokesh Viral Speech

ఎర్రబస్సు కూడా రాని ఊరికి విమానాశ్రయం దేనికంటూ గతంలో పరిహసించిన ప్రత్యర్థులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాటకీయ శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలను, ఈ ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారికి భోగాపురం వేదిక మీది నుంచే సమాధానం చెప్పారు. ఎర్రబస్సు రాలేదన్న చోటే ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చిందని, ఎయిర్ బస్‌లు ల్యాండ్ అవ్వడమే కాకుండా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అడుగుపెట్టారని ఎద్దేవా చేశారు. విమర్శకుల నోళ్లు మూయించేలా ‘ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా!’ అంటూ నారా లోకేష్ వ్యంగ్యంగా ఇచ్చిన పవర్ ఫుల్ పంచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Minister Nara Lokesh delivered a dramatic and sharp counter to opposition leaders who once mocked that a region lacking even a basic red bus service didn’t need an airport. Answering those who looked down upon Uttarandhra, Lokesh pointed out that the very same land now hosts an international airport where airbuses land and Prime Minister Narendra Modi himself arrived. Delivering his signature viral punchline, “This is the power of Uttarandhra… Arthamainda Raja?”, Nara Lokesh’s powerful speech has taken social media by storm.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో మారిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు / PM Modi Unleashes Mega Infrastructure Boost For Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగముగా, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో బృహత్తర మౌలిక వసతుల ప్రాజెక్టుల ఆవిష్కరణ జరిగింది. రాష్ట్ర విమానయాన రంగ చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో ఆవిష్కృతమైంది. రూ. 5600 కోట్లకు పైగా భారీ వ్యయంతో, 2200 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో నిర్మించిన ఈ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఎయిర్పోర్ట్, ప్రారంభంలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం విమానాల రాకపోకలకే పరిమితం కాకుండా ఒక సమగ్ర ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. ఇందులో భాగమైన ఏరోసిటీ, ఏవియేషన్ హబ్, ఎడ్యుసిటీల ద్వారా స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనివల్ల ఉత్తరాంధ్రలో పర్యాటకం, పెట్టుబడులు మరియు ప్రాంతీయ ఆర్థిక ప్రగతి గణనీయంగా పెరుగుతాయి.
విశాఖ సెమీకండక్టర్ – గ్రీన్ ఎనర్జీ నెట్వర్క్
దీంతో పాటు పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు విశాఖపట్నంలో రూ. 460 కోట్లకు పైగా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఏసిప్ సెమీకండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 9 కోట్ల 60 లక్షల సెమీకండక్టర్ చిప్స్ ఉత్పత్తి కానున్నాయి, దీనివల్ల అత్యున్నత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగాలు సృష్టి కానున్నాయి. అలాగే దేశ క్లీన్ ఎనర్జీ రంగానికి ఊతమిచ్చేలా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. కర్నూలు ఫేజ్ వన్ పునరుత్పాదక ఇంధన జోన్ కోసం రూ. 5500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే విద్యుత్ సరఫరా వ్యవస్థకు శంకుస్థాపన జరిగింది. ఇది 4.5 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను జాతీయ గ్రిడ్‌కు అనుసంధానిస్తుంది. అదనంగా కర్నూలు విండ్ అండ్ సోలార్ ఎనర్జీ జోన్ కోసం రూ. 3500 కోట్లు, అలాగే అనంతపురం, కర్నూలు సోలార్ ఎనర్జీ పథకం కోసం రూ. 800 కోట్ల వ్యయంతో పూర్తయిన పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించారు.
జాతీయ రహదారుల ప్రాజెక్టులు – రవాణా సౌకర్యాలు
రవాణా వ్యవస్థను సులభతరం చేసేందుకు, ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచేందుకు రోడ్డు రవాణా రంగంలోనూ కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ రహదారి 565 లోని లింగసముద్రం వద్ద రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించే హైలెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయడంతో పాటు, పూర్తిస్థాయిలో పూర్తయిన 3 ప్రధాన రహదారులను దేశానికి అంకితం చేశారు. వీటిలో రూ. 760 కోట్ల వ్యయంతో నిర్మించిన 27 కిలోమీటర్ల రేచర్ల-గురువాయిగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవే, రూ. 930 కోట్ల వ్యయంతో నిర్మించిన 29 కిలోమీటర్ల గురువాయిగూడెం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే, రూ. 160 కోట్ల వ్యయంతో రూపొందించిన 6 కిలోమీటర్ల తాడిపత్రి బైపాస్ రహదారులు ఉన్నాయి. ఈ కారిడార్లు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ప్రయాణ సమయాన్ని, ప్రమాదాలను తగ్గిస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ బహుళ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రవాణా, ఇంధనం, సాంకేతిక, ఆర్థిక రంగాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తాయి.
Bhogapuram Airport And Mega Projects Launch A New Era For AP
In a monumental push towards realizing the vision of Viksit Bharat and Viksit Andhra Pradesh, major infrastructure projects were unveiled under the leadership of Prime Minister Narendra Modi, Chief Minister N. Chandrababu Naidu, and Deputy Chief Minister Pawan Kalyan. Marking a historic milestone in the state’s aviation sector, the Alluri Sitarama Raju International Airport at Bhogapuram was inaugurated. Developed at an investment of over 5,600 crore rupees across 2,200 acres, this next-generation smart airport has an initial capacity to serve 6 million passengers annually. Beyond serving as an air travel hub, it integrates an Aerocity, Aviation Hub, and EduCity to bring together enterprise, talent, learning, and community. This ecosystem will foster skill development, high-value jobs, healthcare, and education while driving tourism, investment, and overall economic growth across the region.
To position Andhra Pradesh at the forefront of technology and clean energy, significant industrial and power transmission projects were launched. The foundation stone was laid for the ASIP semiconductor manufacturing facility at Visakhapatnam, being built with an investment of over 460 crore rupees. This plant will produce around 96 million semiconductor chips annually, creating high-skilled employment opportunities. Furthering India’s clean energy transition, foundation stone was laid for the transmission system of the Kurnool 4 Renewable Energy Zone Phase 1, developed at over 5,500 crore rupees to evacuate 4.5 gigawatts of green power into the national grid. Additionally, two major completed transmission schemes were inaugurated: the Kurnool Wind and Solar Energy Zone transmission system at over 3,500 crore rupees, and the Ananthapuramu and Kurnool Solar Energy Zone transmission scheme at over 800 crore rupees, together strengthening the reliability of the national power grid.
In the road transport sector, key projects were dedicated to enhance connectivity, safety, and economic integration across Andhra Pradesh. The foundation stone was laid for a high-level bridge at Lingasamudram on NH-565 at a cost of over 25 crore rupees. Simultaneously, three completed highway corridors were dedicated to the nation: the 27 km Recharla to Guravayigudem Greenfield Highway built at over 760 crore rupees, the 29 km Guravayigudem to Devarapalli Greenfield Highway constructed at over 930 crore rupees, and the 6 km Tadipatri Bypass on NH-67 developed at over 160 crore rupees. These highway corridors will improve regional linkages, shorten travel distances, enhance access to major religious destinations, and ensure safer journeys. Collectively, these multi-sectoral initiatives mark a decisive step toward transforming Andhra Pradesh’s economic landscape.
తాజా వార్తలు

డేటా సెంటర్ల చుట్టూ దుమారం.. నిజం ఎక్కడ? Vizag Data Centre Push Faces Water, Green Concerns
August 20, 2026, 7:04 AM IST

Dr Ainapurapu Receives National Anubhav Award 2026
August 18, 2026, 6:47 PM IST

దక్షిణాదిపై గురి.. తెలంగాణకు చోటేదీ? BJP’s New National Team Leaves Telangana Out of Southern Equation
August 18, 2026, 7:41 AM IST

అసెంబ్లీ వద్దు.. శాసనమండలి ముద్దు – ఇదేం తీరు? YSRCP Bets on Council as Assembly Boycott Continues
August 13, 2026, 7:15 AM IST

వైసీపీకి డీఎస్సీ ఆక్సిజన్.. పాలపొంగేనా? DSC Row Gives YSRCP Fresh Political Momentum in Andhra Pradesh
August 11, 2026, 7:01 PM IST
