తెలంగాణ

హైదరాబాద్‌ రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అప్‌డేట్‌: ఆగస్టులోనే 3 నెలల కోటా బియ్యం, గోధుమల పంపిణీ! Big Update for Telangana Ration Card holders. 3 months quota of Rice and Wheat to be distributed in August

హైదరాబాద్‌ రేషన్‌ కార్డుదారులకు తీపి కబురు

హైదరాబాద్ జిల్లాలోని ఫుడ్ సెక్యూరిటీ కార్డు (ఎఫ్‌ఎస్‌సీ) లబ్ధిదారులకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన ఆహార ధాన్యాలను ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.

ఉచితంగా బియ్యం.. గోధుమల ధర ఎంతంటే?

ఈ పంపిణీలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బియ్యాన్ని పూర్తి ఉచితంగా అందజేయనున్నారు. అయితే గోధుమలకు మాత్రం కిలోకు రూ.7 చొప్పున వసూలు చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు.

కేటాయింపుల వివరాలు

హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 8,43,607 ఎఫ్‌ఎస్‌సీ లేదా రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరి అవసరాల కోసం పౌరసరఫరాల శాఖ 59,602.822 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,279.513 మెట్రిక్ టన్నుల గోధుమలను కేటాయించింది. లబ్ధిదారులు ఆగస్టు నెలలోనే తమకు కేటాయించిన 3 నెలల సరుకులను సమీప రేషన్ షాపుల ద్వారా తీసుకోవాలని అధికారులు సూచించారు.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *