బియ్యం ధర తగ్గించిన ఏపీ ప్రభుత్వం: విజయవాడలో విక్రయాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల / AP Govt Starts Subsidized Rice Sales at ₹50 per Kg Across State
సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పడుతున్న ఆర్థిక భార తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. బహిరంగ మార్కెట్లో బియ్యం Rice ధరలు పెరిగిన నేపథ్యంలో, ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సబ్సిడీ ధరలకే అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని ఏపిఐఐసి రైతు బజార్ వద్ద ఈ ప్రత్యేక బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.
ముఖ్యాంశాలు:
- రాష్ట్రవ్యాప్తంగా విక్రయాలు: 130కి పైగా రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల ప్రత్యేక అవుట్లెట్ కౌంటర్ల ద్వారా విక్రయాలు సాగుతున్నాయి.
- ప్రత్యేక ధరలు:
- బిపిటి సూపర్ ఫైన్ (స్టీమ్ బియ్యం): కిలో ₹52 (బహిరంగ మార్కెట్ ధర ₹62 – ₹65 వరకు)
- బిపిటి రా బియ్యం (పచ్చి బియ్యం): కిలో ₹50 (బహిరంగ మార్కెట్ ధర ₹58 – ₹60 వరకు)
- పరిమితి: ఆధార్ కార్డ్ ఆధారంగా ఒకరికి/కుటుంబానికి 10 కిలోల చొప్పున బియ్యం అందజేస్తారు.
రాబోయే రోజుల్లో ఇతర నిత్యావసరాలు:
ధరల స్థిరీకరణలో భాగంగా ప్రజలకు ఉపశమనం అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి తెలిపారు. బియ్యంతో పాటు రాబోయే రోజుల్లో శనగపప్పు, పామాయిల్ వంటి ఇతర నిత్యావసర సరుకులను కూడా తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మార్కెట్ ధరల కంటే గణనీయంగా తక్కువకే నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉన్నందున, రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.
తాజా వార్తలు

డేటా సెంటర్ల చుట్టూ దుమారం.. నిజం ఎక్కడ? Vizag Data Centre Push Faces Water, Green Concerns
August 20, 2026, 7:04 AM IST

Dr Ainapurapu Receives National Anubhav Award 2026
August 18, 2026, 6:47 PM IST

దక్షిణాదిపై గురి.. తెలంగాణకు చోటేదీ? BJP’s New National Team Leaves Telangana Out of Southern Equation
August 18, 2026, 7:41 AM IST

అసెంబ్లీ వద్దు.. శాసనమండలి ముద్దు – ఇదేం తీరు? YSRCP Bets on Council as Assembly Boycott Continues
August 13, 2026, 7:15 AM IST

వైసీపీకి డీఎస్సీ ఆక్సిజన్.. పాలపొంగేనా? DSC Row Gives YSRCP Fresh Political Momentum in Andhra Pradesh
August 11, 2026, 7:01 PM IST

మంచి ఆలోచన