ఆంధ్రప్రదేశ్తెలంగాణ

చేరువుగట్టు అగ్నిప్రమాద బాధితులకు ఆర్యవైశ్య మహాసభ అండ: రూ. 2 లక్షల ఆర్థిక సాయం / Arya Vysya Mahasabha Gives ₹2 Lakh Aid to Fire Victims

చేరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఇటీవల సంభవించిన ప్రమాదంలో దుకాణాలు, ఇళ్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అండగా నిలిచింది. ఆపదలో ఉన్న స్వజనులను ఆదుకునేందుకు ఆర్యవైశ్య మహాసభ ముందుకు వచ్చి తన ఉదారతను చాటుకుంది.

బాధితులకు రూ. 2 లక్షల చెక్కుల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన రంగా శ్రవణ్ కుమార్ కు ₹1,00,000/-, కర్నాటి ఎల్లయ్య కు ₹1,00,000/- చెక్కుల రూపంలో పరిహారాన్ని అందజేసి భరోసా ఇచ్చారు.

ఈ సాయం పంపిణీ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్లే మల్లికార్జున్, కోశాధికారి రేణిగుంట గణేష్ గుప్తా, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇరుకుల్ల రామకృష్ణ, కోఆర్డినేటర్ చింతల రవి కుమార్ సహా పలువురు ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

 

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిరంతర సేవా స్ఫూర్తికి నిదర్శనమని ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *