ఉండవల్లిలో రాక్షసకాండ.. కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!Atrocities In Undavalli: Jagan Mohan Reddy Blasts Chandrababu Naidu Government!
ఉండవల్లి భూములపై జగన్ సంచలన పోస్ట్
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో సాగుతున్న ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం jagan Blasts Chandrababu Government అక్కడ రాక్షసకాండ సాగిస్తోందని ఆయన తీవ్రంగా ఖండించారు. అసలు రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ఈ దారుణాల వెనుక లబ్ధిదారులు రైతులా లేక చంద్రబాబు అస్మదీయులా? అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. తమ జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను వినకుండా గొంతు నొక్కడంపై జగన్ మండిపడ్డారు.
పోలీసుల మోహరింపు.. బుల్డోజర్ల ధ్వంసకాండ
రైతుల అభ్యంతరాలను కనీసం వినకుండా ప్రభుత్వం ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. పొలాల్లో పోలీసులను భారీగా మోహరించి, బుల్డోజర్లతో దూసుకెళ్లి సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. రైతులను వారి సొంత పొలాల నుంచి బలవంతంగా ఈడ్చిపారేస్తూ, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమని ఆయన విమర్శించారు. బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులేనని, ఆ కొద్దిపాటి భూమే వారి కుటుంబాల పోషణకు, పిల్లల చదువులకు ఏకైక ఆధారమని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
రైతుల జీవనాధారం నాశనం చేస్తున్నారు
మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి అని రైతులు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారిని అణచివేయడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని జగన్ ధ్వజమెత్తారు. రైతులు పెట్టిన పెట్టుబడి ఏమవ్వాలి, ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారని, మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు వెంటాడుతోందని ఆయన నిలదీశారు. రైతులపై పోలీసులను ప్రయోగించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన ఆరోపించారు.
అత్యంత విలువైన భూములపై కన్ను
రైతుల అంగీకారం లేకుండా భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకోవడం తీవ్ర అన్యాయమని జగన్ పేర్కొన్నారు. ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవని, విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై-కోల్కతా జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములని ఆయన వివరించారు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను ప్రభుత్వమే నిర్ణయించి లాక్కోవడం వెనుక ఉన్న అసలు లబ్ధిదారులు ఎవరని ఆయన ప్రశ్నించారు.
రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ అండ
రైతుల భూములను బలవంతంగా లాక్కుని వారిని రోడ్డుమీద పడేస్తే చూస్తూ ఊరుకునేది లేదని జగన్ హెచ్చరించారు. రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోవాలి కానీ, పోలీసులను పెట్టి పంటలను నాశనం చేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లిలో జరుగుతున్న బలవంతపు చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదని, రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని జగన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు

డేటా సెంటర్ల చుట్టూ దుమారం.. నిజం ఎక్కడ? Vizag Data Centre Push Faces Water, Green Concerns
August 20, 2026, 7:04 AM IST

Dr Ainapurapu Receives National Anubhav Award 2026
August 18, 2026, 6:47 PM IST

దక్షిణాదిపై గురి.. తెలంగాణకు చోటేదీ? BJP’s New National Team Leaves Telangana Out of Southern Equation
August 18, 2026, 7:41 AM IST

అసెంబ్లీ వద్దు.. శాసనమండలి ముద్దు – ఇదేం తీరు? YSRCP Bets on Council as Assembly Boycott Continues
August 13, 2026, 7:15 AM IST

వైసీపీకి డీఎస్సీ ఆక్సిజన్.. పాలపొంగేనా? DSC Row Gives YSRCP Fresh Political Momentum in Andhra Pradesh
August 11, 2026, 7:01 PM IST
