న్యాయమైన హక్కుల కోసం విశ్రాంత ఉద్యోగుల గర్జన.. సూళ్లూరుపేటలో పెన్షనర్ల భారీ ధర్నా | Central and State Pensioners Stage Massive Protest in Sullurupeta Demanding Pension Rights and Pay Commission Revisions
పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయ కాదు.. దశాబ్దాల నిస్వార్థ సేవకు ఉద్యోగులకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు లేని నిబంధనలు.. రక్తం ధారబోసిన విశ్రాంత ఉద్యోగులపైనే ఎందుకు రుద్దుతున్నారంటూ సూళ్లూరుపేటలో పెన్షనర్లు కదం తొక్కారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం తుది శ్వాస వరకు రాజీలేని పోరాటం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఐక్యవేదిక (JAC) ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీ (NCCPA) పిలుపు మేరకు భారీ ధర్నా నిర్వహించారు. దాదాపు 59 కోర్టు తీర్పులు, పార్లమెంటరీ కమిటీల సిఫార్సులు తమకు అనుకూలంగా ఉన్నా ప్రభుత్వాలు పెన్షన్ నిబంధనలను నిర్వీర్యం చేస్తున్నాయని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వత ఉద్యోగులను గిగ్ వర్కర్లతో పోల్చడం, కాంట్రాక్ట్ విధానాలను తెరపైకి తేవడం దారుణమని మండిపడ్డారు.
ప్రధాన డిమాండ్లు:
- వివాదాస్పద పెన్షన్ రూల్స్ వ్యాలిడేషన్ చట్టం-2025ను తక్షణమే రద్దు చేయాలి.
- 2026కు ముందు రిటైరైన వారికి న్యాయం జరిగేలా 8వ వేతన సంఘం నిబంధనలను సవరించాలి.
- తక్షణమే మధ్యంతర భృతి (IR) ప్రకటించి, 50 శాతం DA/DRను మూల వేతనం/పెన్షన్‌లో విలీనం చేయాలి.
- BSNL, MTNL విశ్రాంత ఉద్యోగులకు 2017 జనవరి 1 నుంచి పెన్షన్ సవరణను పునరుద్ధరించాలి.
- బ్యాంకు పెన్షన్ల అప్‌డేషన్ చేపట్టడంతో పాటు అటానమస్ సంస్థల ఉద్యోగులకు 8వ పీఆర్సీ, CGHS ప్రయోజనాలు విస్తరించాలి.
- కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించాలి.
వృద్ధాప్యంలో పెరుగుతున్న వైద్య ఖర్చులు, నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై పాలకులు స్పందించి, తక్షణమే న్యాయం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.



తాజా వార్తలు

డేటా సెంటర్ల చుట్టూ దుమారం.. నిజం ఎక్కడ? Vizag Data Centre Push Faces Water, Green Concerns
August 20, 2026, 7:04 AM IST
Dr Ainapurapu Receives National Anubhav Award 2026
August 18, 2026, 6:47 PM IST

దక్షిణాదిపై గురి.. తెలంగాణకు చోటేదీ? BJP’s New National Team Leaves Telangana Out of Southern Equation
August 18, 2026, 7:41 AM IST

అసెంబ్లీ వద్దు.. శాసనమండలి ముద్దు – ఇదేం తీరు? YSRCP Bets on Council as Assembly Boycott Continues
August 13, 2026, 7:15 AM IST

వైసీపీకి డీఎస్సీ ఆక్సిజన్.. పాలపొంగేనా? DSC Row Gives YSRCP Fresh Political Momentum in Andhra Pradesh
August 11, 2026, 7:01 PM IST
జాతీయతలో ప్రాంతీయ అస్తిత్వానికి చోటెంత? / Tamil Nadu Anthem Resolution Puts Federal Identity in Focus
August 10, 2026, 4:34 PM IST
