ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణ

తొలి ప్రయత్నంలోనే కక్ష్యలోకి ‘విక్రమ్‌-1’.. స్కైరూట్‌ కీలక ప్రకటన

హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష రంగ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన విక్రమ్‌-1 రాకెట్‌ Skyroot’s Vikram-1 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో సంస్థ తాజాగా సామాజిక మాధ్యమాల్లో స్పందించింది. ప్రయోగం నుంచి ఉపగ్రహాల విభజన వరకు సాగిన కీలక ఘట్టాలను వీడియో రూపంలో పంచుకుంది.

“సరిగ్గా 24 గంటల క్రితం ఒక రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పుడు వంద కోట్లకుపైగా కలలు రెక్కలు తొడిగాయి” అని స్కైరూట్‌ పేర్కొంది. కొత్త ప్రయోగ వాహనం తొలి ప్రయత్నంలోనే కక్ష్యను చేరుకోవడం ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదైన విజయమని తెలిపింది. భారత్‌ నుంచి ప్రపంచం కోసం మరో కొత్త ప్రయోగ వాహనం అందుబాటులోకి వచ్చిందని ప్రకటించింది.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *